చెన్నైలో గే ఘాతుకాలు.. మాటల్లో చెప్పలేని.. - MicTv.in - Telugu News
mictv telugu

చెన్నైలో గే ఘాతుకాలు.. మాటల్లో చెప్పలేని..

June 13, 2019

Chennai Man who slashed genitals after gay sex encounter held for killed...

అతడు స్వలింగ సంపర్కుడు.. ఫూటుగా మందు కొడతాడు. తనకు నచ్చినవారితో స్వలింగ సంపర్కం చేస్తాడు. అనంతరం వారి మార్మాయవాలు కోసి పారిపోతాడు. ఇతడి వలకు చిక్కి ఇద్దరు యువకులు బలయ్యారు. రెండు ఘటనల్లోనూ ఇద్దరి మార్మాయవాలు కోసేసి, వారు ప్రాణాపాయ స్థితిలో వున్నారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఈ మిస్టరీని చేధించడం పోలీసులకు సవాల్‌గా మారింది. చెన్నైలోని రెట్టేరీ చెరువు ప్రాంతంలో మే 25న బాషా అనే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడి మర్మావయాలు కోసేసినట్లు గుర్తించారు. వెంటనే అతడిని స్టాన్లీ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటన తాలూకు వివరాల కోసం అతడిని విచారించగా.. తాను మద్యం మత్తులో ఉన్నప్పుడు ఘటన జరగడంతో ఎవరు చేశారో తనకు గుర్తులేదని బాషా చెప్పడు. దీంతో పోలీసులకు నిందితుడిని పట్టుకోవడం కష్టంగా మారింది.  

జూన్ 1వ తేదీన నగరంలోని మరో ప్రాంతంలో నారాయణ పెరుమాళ్ అనే వ్యక్తి కూడా ఇదే తరహాలో ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు. అతడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఆరా తీశారు. తనతో ఓ వ్యక్తి గే సెక్స్‌ చేశాడని.. అనంతరం తన అవయవాలు కోసేసి పారిపోయినట్లు తెలిపాడు. ఈ రెండు ఘటనలు ఒకే తరహాలో జరగడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. రెండు ప్రాంతాల్లో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఈ దారుణాలు చేసింది మునియస్వామి అని తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించగా మరిన్ని ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు. గే సెక్స్ చేయడం తనకు స్కూల్‌లో చదువుతున్పప్పటినుంచే అలవాటు వుందని చెప్పాడు. ఫ్రెండ్స్‌తో స్వలింగ సంపర్కరం చేసేవాడినని, ఆ అలవాటుతోనే ఒంటరిగా మద్యం మత్తులో ఉన్న వారిద్దరితో సెక్స్‌ చేసినట్లు చెప్పాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.