ఇకపై మెట్రోరైళ్లోనూ ఉచిత వైఫై.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇకపై మెట్రోరైళ్లోనూ ఉచిత వైఫై..

November 25, 2019

ఇప్పటికే మెట్రో రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తోన్న సంగతి తెల్సిందే. తాజాగా మెట్రో రైళ్లలో కూడా ఉచిత వైఫై కల్పించడానికి చెన్నై మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్‌ నుంచి ఉచిత ‘వైఫై’ సదుపాయాన్ని కల్పించనున్నారు. దీంతో మెట్రో ప్రయాణికులు ప్రయాణ సమయంలో తమ సెల్‌ఫోన్లలో వైఫై సదుపాయాన్ని ఉపయోగించుకొని వినోద కార్యక్రమాలను వీక్షించవచ్చు. 

Chennai Metro.

సొరంగంలో ఉన్న చెన్నై మెట్రోరైల్వేస్టేషన్లలో సరైన సిగ్నల్స్‌ లేక సెల్‌ఫోన్లు పనిచేసేవి కావు. ఆ తర్వాత ఆ స్టేషన్లలో సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ వచ్చేలా చర్యలు చేపట్టారు. మెట్రో రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టే ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫొన్‌లో వైఫై పొందేందుకు ప్రత్యేక ‘యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.