వీళ్లను ఏమంటారో మీ ఇష్టం.... - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్లను ఏమంటారో మీ ఇష్టం….

August 9, 2017

ధర్మానికి, న్యాయానికి… అంటూ కనపడని నాలుగో సింహాం మేరా  పోలీస్… గుర్తింది కదా ఈ డైలాగ్. అయితే చెన్నై రైల్వే స్టేషన్లో ఓ కూలీని దోచుకున్న ఈ పోలీసుల గురించి మీరు తెల్సుకుని తీరాల్సిందే.   స్టోరీ అంతా చద్విన తర్వాత వీళ్లను ఏమంటారో మీ ఇష్టం.

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్  నిత్యం వేలాది మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. ఇట్లాగే ఓడిశాకు చెందిన బిజేంద్రరెడ్డి అనే కూలీ కేరళ వెళ్లేందుకు  స్టేషన్ లోని ఫ్లాట్ ఫాంపై పడుకున్నాడు. తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో ముగ్గురు పోలీసులు వచ్చారు. అతని వద్ద ఉన్న 15 వందల రూపాయలు, సెల్ ఫోన్ గుంజుకున్నారు. తాను కేరళ వెళ్లేందకు మూడు వందల రూపాయలు ఇవ్వాలని వేడుకోగా మూడు వందలిచ్చిపోయారు. ఈ విషయం గురించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీ, అక్కడి రిక్షాకార్మికులు చెప్పిన వివరాల ప్రకారం   నిందితులను  అరెస్టు చేశారు పోలీసులు. బతుకు దెరువు కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన కూలీని  దోచుకున్న ఈ పోలీసులను ఏమనాలో మరి.