Chennai: Sivaji’s daughters move High court against brothers in property dispute
mictv telugu

శివాజీ గణేశన్ కుటుంబంలో రచ్చ.. ఆస్తి కోసం కోర్టుకెక్కిన కుమార్తెలు

July 8, 2022

Chennai: Sivaji’s daughters move High court against brothers in property dispute

ఒకప్పటి తమిళ స్టార్ హీరో, దివంగత శివాజీ గణేశన్ కుటుంబంలో ఉన్న ఆస్తి వివాదాలు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. శివాజీ గణేశన్‌కు నలుగురు సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. శివాజీ గణేషన్ కుమారులలో ప్రభు నటుడిగా అందరికీ సుపరిచితమే. మరో కుమారుడు పేరు రామ్ కుమార్ కూడా నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు. ఇక ఇద్దరు కుమార్తెల పేర్లు శాంతి నారాయణ స్వామి, రాజ్వీ గోవిందరాజన్.

ఇప్పుడు ఆ ఇద్దరూ కుమార్తెలు కలిసి కోర్టును ఆశ్రయించారు. శివాజీ గణేషన్ మరణం తర్వాత ఆయన సంపాదించిన 270 కోట్ల రూపాయల ఆస్తి పంపకం సరిగా జరగలేదని వారు భావిస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ప్రభు, రామ్ కుమార్ లు తమకు తెలియకుండా కొన్ని ఆస్తులు విక్రయించారని శాంతి నారాయణ స్వామి, రాజ్వీ గోవిందరాజన్ ఆరోపిస్తున్నారు,

Chennai: Sivaji’s daughters move High court against brothers in property dispute

సుమారు 1000 సవర్ల బంగారం 500 కేజీల వెండి సహా శాంతి థియేటర్స్ మాత్రమే కాక మరో 82 కోట్ల రూపాయల ఆస్తి తమ సోదరులు తమ పేరిట మార్చి రాసుకున్నారని కోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి రాసినట్లు ఉన్న వీలునామా నకిలీదని వారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పేరిట తమ దగ్గర సంతకం తీసుకుని తనను మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభు కుమారుడు హీరో విక్రమ్ ప్రభు, దుష్యంత్ పేర్లు కూడా ఈ కేసులో చేర్చడం సంచలనంగా మారింది. ఈ విషయం మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. తమ సోదరులు అమ్మిన ఆస్తుల అమ్మకం ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని శివాజీ గణేషన్ కుమార్తెలు కోరుతున్నారు.