Home > Featured > మీనా అక్కకు వనక్కం.. కుక్కల కడుపు నింపుతూ పస్తులుంటోంది..

మీనా అక్కకు వనక్కం.. కుక్కల కడుపు నింపుతూ పస్తులుంటోంది..

meena

కొందరికి జంతువులంటే పిచ్చి ప్రేమ. మనుషుల మోసాలు, కల్లిబొల్లి మాటలతో విసుగెత్తిన మీనాకు కూడా అవంటే మరింత ప్రేమ. కల్లాకపటం ఎరుగని వీధికుక్కలను ఆమె చేరదీసింది. వాటి బాగోగులు చూడ్డానికి పెళ్లి అడ్డొస్తుందని ఒంటరిగానే మిగిలిపోయింది. లాక్‌డౌన్ వల్ల ఆమె మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. తను సాదుకుంటున్న కుక్కులక తిండి కొరత రాకుండా తాను ఒక పూటే తింటోంది.

చెన్నైకి చెందిన మీనా పెళ్లి చేసుకోకపోవడం ఇప్పటికే తమిళనాడు పెద్ద వార్తయింది. తాజాగా కరోనా పాపమా అని ఆమె కడుపు మాడ్చుకుంటోంది. వంట మ‌నిషిగా ప‌నిచేస్తున్న మీనా లాక్ డౌన్ వల్ల పనులకు వెళ్లలేకపోతోంది. దీంతో చేతిలో డబ్బులు ఆడక పస్తులు పడుకుంటోంది. ఉన్నంతలో కుక్కలకు అన్నం వండి వార్చి తాను ఒక పూట మాత్రమే తిని, రెండు పూటలా నీళ్లు తాగి పడుకుంటోంది. ‘ఏం చెయ్యమంటారు చెప్పండి. ‘నాకు13 కుక్కలు ఉన్నాయి. రేషన్ వాటికే చాలదు. అందుకే నేను కాసింత ఎంగిలి పడి మొత్తం వాటికే పెడుతున్నాను. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు ఇలాగా పస్తులుంటాను. ఆ దేవుడు నా గోడు వినకపోతాడా?’ అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రెండు గదుల ఇంట్లో ఉంటున్న మీనా 21 ఏళ్ల నుంచి కుక్కల ఆకలి తీరుస్తోంది.

Updated : 25 May 2020 7:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top