ఆలయాల పునరుద్ధరణ పేరుతో విరాళాలు.. యూట్యూబర్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆలయాల పునరుద్ధరణ పేరుతో విరాళాలు.. యూట్యూబర్ అరెస్ట్

May 30, 2022

దేవాలయాల పునరుద్ధరణ పేరుతో విరాళాలు సేకరిస్తున్న యూట్యూబర్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఇళయ భారతం’ అనే చానెల్‌ని నడుపుతున్న యూట్యూబర్ కార్తీక్ గోపీనాథ్‌ అనే వ్యక్తి హిందూమత, ధర్మాదాయ శాఖ (హెచ్ఆర్అండ్ సీఈ) డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండానే వారి పేరుచెప్పి ఈ ఛానెల్ నడుపుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అరవిందన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఆవడి పోలీసులు కార్తీక్ గోపీనాథ్‌ను అరెస్ట్ చేశారు. అరుల్మిగు మధుర కాళియమ్మ దేవాలయంలోని ఉప దేవాలయాల విగ్రహాలను పునరుద్ధరించే నెపంతో నిధుల సేకరణ కోసం వెబ్‌సైట్ రన్ చేస్తున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్తీక్ గోపీనాథ్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించుకున్నాడని ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సీసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందన్నారు.