చెన్నమనేని రమేష్‌ భారతీయుడు కాదు: కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

చెన్నమనేని రమేష్‌ భారతీయుడు కాదు: కేంద్రం

December 15, 2017

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతపౌరుడు కాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఆయన  భారతపౌరుడు కాదని గతంలోనే  హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన హోంశాఖలో చెన్నమనేని రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. హోం శాఖ ఈ పిటిషన్ను కొట్టేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ సర్టిఫికెట్లతో రమేష్‌ వేములవాడ ప్రజలను మోసం చేశాడని బీజేపీ కార్యకర్గ సభ్యుడు  శ్రీనివాస్‌ ఆరోపించారు. వేములవాడ ప్రజలను మోసం చేసిన రమేష్‌పై సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.