దిశ నిందితులకు జైలులో మటన్ కర్రీ భోజనం - MicTv.in - Telugu News
mictv telugu

దిశ నిందితులకు జైలులో మటన్ కర్రీ భోజనం

December 2, 2019

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఉన్న నలుగురు నిందితులను చర్లపల్లి జైలులో ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. మిగిలిన ఖైదీలతో కలవకుండా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అక్కడ మూడు షిఫ్టుల్లో పోలీసులు విధులు నిర్వహిస్తూ.. వారిపై నిఘా ఏర్పాటు చేశారు. జైలుకు వెళ్లిన తొలి రోజు వీరికి కౌన్సిలింగ్ నిర్వహించారు. జైల్లో వీరికి ఏర్పాటు చేసిన వసతులను అధికారులు వెల్లడించారు. 

Disha Case Accused.

ఈ నలుగురికి ఆదివారం ఉదయం పులిహోరతో టిఫిన్, మధ్యాహ్నం 250 గ్రాముల భోజనం రాత్రి మటన్ కర్రీతో మరోసారి భోజనం అందించినట్టు వెల్లడించారు. మధ్యలో రెండు సార్లు టీ కూడా అందించారు. జైలు నిబంధనల ప్రకారం ప్రతి ఆదివారం ఖైదీలకు మాంసం కూరతో భోజనం వడ్డిస్తారు. దాంట్లో భాగంగా నిన్న వీరికి మటన్ కర్రీ అందించారు. ప్రత్యేక బ్యారక్‌లో ఉన్న వీరు రాత్రంతా నిద్ర కూడా పోలేదని వెల్లడించారు.  కరుడుగట్టిన నేరస్తుల కేటాయించే సెల్‌ను వీరికి కేటాయించారు. ప్రతి క్షణం భద్రతో పాటు వీరిపై ప్రత్యేక నిఘా ఉంచారు.