అగ్ని గుండంలో అపశ్రుతి.. మహిళకు తప్పిన ప్రమాదం  - MicTv.in - Telugu News
mictv telugu

అగ్ని గుండంలో అపశ్రుతి.. మహిళకు తప్పిన ప్రమాదం 

February 4, 2020

mngv

చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన  అగ్నిగుండాల కార్యక్రమంలో ఓ మహిళకు తృటిలో ప్రమాదం తప్పింది. భక్తులు అందరూ నిప్పులపై నడుస్తుండగా ఓ మహిళ కూడా నిప్పులు తొక్కుతూ.. అందులోనే పడిపోయింది. వెంటనే అక్కడున్నవారు ఆమెను పక్కకు లాగడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్వల్పగాయాలు అయ్యాయని ప్రమాదమేమి లేదని వైద్యులు వెల్లడించారు. 

నార్కెట్‌పల్లిలో కొలువైన జడల రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. ఇక్కడి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. మొక్కులు సమర్పించి అగ్ని గుండాల్లో నడుస్తారు. అలాగే అగ్ని గుండంలో నడిచి ఓ మహిళ పడిపోవడం తీవ్ర కలకలం రేపింది. కాగా ఈ ఉత్సవాలు ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు సాగనున్నాయి.