Chessable Masters final: Praggnanandhaa loses to Ding Liren in tie-break
mictv telugu

ఫైనల్స్‌లో పోరాడి ఓడిన ప్రజ్ఞానంద

May 27, 2022

Chessable Masters final: Praggnanandhaa loses to Ding Liren in tie-break

మెల్ట్‌వాటర్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత యువ కెరటం ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. రెండు రోజలు పాటు ప్రపంచ రెండో ర్యాంకర్‌ డింగ్‌ లీరెన్‌ (చైనా)తో జరిగిన పోరులో ఓడిపోయాడు. ఆఖరి సమరంలో భాగంగా తొలిరోజు ప్రజ్ఞానంద 1.5-2.5తో నిలిచాడు. మొదటి తొలి గేమ్‌ను కోల్పోయినా రెండో గేమ్‌లో గెలిచి స్కోరు సమం చేశాడు. అయితే మూడో గేమ్ను మళ్లీ ప్రజ్ఞానంద కోల్పోవాల్సి వచ్చింది.

నాలుగో గేమ్‌ను 39 ఎత్తుల్లో డ్రా చేసుకుని ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. చివరి రోజు జరిగిన గేమ్లలో లీరెన్‌ ముందంజలో ఉండటం వల్ల అతడినే విజేతగా ప్రకటించారు న్యాయ నిర్ణేతలు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ప్ర‌జ్ఞానంద కోచ్ ఆర్‌బీ ర‌మేశ్ ఇండియ‌న్ కుర్రాడిని తెగ ప్ర‌శంసించాడు. సెమీస్‌లో డ‌చ్ ప్లేయ‌ర్ అనిశ్ గిరిని ప్ర‌జ్ఞానంద ఓడించ‌డం విశేషం. ఇక ప్రిలిమ‌రీ రౌండ్ స‌మ‌యంలోనూ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌ను ఓడించిన విష‌యం తెలిసిందే.