Chetan Sharma resigns as BCCI Chief Selector
mictv telugu

Chetan Sharma Resigned:BCCI చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా..!!

February 17, 2023

Chetan Sharma resigns as BCCI Chief Selector

బీసీసీఐ చీఫ్ సెలెక్ట్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. టీమిండియా ఆటగాళ్లపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చేతన శర్మ రాజీనామాకు బీసీసీఐ కూడా వెంటనే ఆమోదం తెలిపింది. ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మీ టీమిండియాపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూళీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి పలు ఆసక్తికరమైన విషయాలన వెల్లడించారు చేతన్ శర్మ.

కోహ్లీ – రోహిత్‌ మధ్య విబేధాలు లేవని.. వారిలో ఇగో ఉందన్నాడు. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేసి బీసీసీఐపై పైచేయి సాధించాలని కోహ్లీ భావించాడనట్లు చెప్పాడు. దీనివల్లే గంగూలీ, కోహ్లీ మధ్య అంతరం పెరిగిందని చెప్పాడు. టీమిండియా ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌ ప్రూవ్‌ చేసుకునేందుకు ఇంజెక్షన్లు వాడుతారని.. డోపింగ్‌ టెస్ట్‌లో అవి దొరకవని చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలా ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడంపై బీసీసీఐ పెద్దలు చేతన్‌ శర్మపై సీరియస్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనపై వేటు వేసే అవకాశం ఉందని అంతా భావించారు. ఇలాంటి తరుణంలో చేతన్‌ శర్మ రాజీనామా చేయడం, బీసీసీఐ వెంటనే ఆమోదించడం గమనార్హం.