Chetan Sharma Sting Operation a big plan ?
mictv telugu

ప్లాన్ ప్రకారమే చేతన్ శర్మ స్ట్రింగ్ ఆపరేషన్..? దీని వెనుక ఎవరంటే..

February 15, 2023

Chetan Sharma Sting Operation a big plan ?

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వ్యాఖ్యలు భారత్ క్రికెట్‎ను కుదిపేస్తున్నాయి. ప్రధానంగా బారత్ ఆటగాళ్లు ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుంటారంటూ చేతన్ శర్మ చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయం భారత్ క్రికెట్‌కే అవమానకరంగా బోర్డు పెద్దలు, ఆటగాళ్లతో పాటు అభిమానులు భావిస్తున్నారు. రోహిత్, కోహ్లీ గొడవలు, కోహ్లీ, గంగూలీ మధ్య ఇష్యూ, జట్టులో గ్రూప్‎లు వంటి అంశాల నిజమే అని చేతన్ శర్మ మరోసారి నిర్ధారించడం దుమారం రేపుతోంది. జీన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్‌లో చేతన్ చేసిన వ్యాఖ్యలు ఆటగాళ్ళపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇటీవల కాలంలో భారత్ ఆటగాళ్లు తీవ్ర గాయాలు బారిన పడిన సమయంలో ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుంటారని చేతన్ శర్మ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. స్వల్ప గాయాలతో బాధపడుతున్న సమయంలో ఇలాంటి ఉత్ప్రేరకాలు వాడి బరిలోకి దిగడంతో గాయాలు తీవ్రమైనట్లు అనుమానిస్తున్నారు. బుమ్రా కూడా ఇలాంటి ఇంజెక్షన్ తీసుకునే తీవ్ర గాయానికి గురయ్యాడాని అతడు చెప్పి బాంబ్ పేల్చాడు. బుమ్రాతో పాటు ఎవరెవరూ ఇలాంటి ఉత్ప్రేరకాలు వాడేరన్నది ఆసక్తిగా మారింది.

క్రికెట్ లోకాన్ని ఊపేస్తున్న చేతన్ శర్మ వ్యాఖ్యలపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతుంది. చేతన్ శర్మపై విచారణకు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చేతన్ శర్మ ఎఫెక్ట్ ఆటగాళ్లపై పడకుండా ముందుకు వెళ్తుంది. ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే అతడిపై చర్యలు తీసుకోవాలని లేదా సిరీస్ ముగిశాక అన్నదానిపై బీసీసీఐ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఈ విషాయాన్ని ఓ బీసీసీఐ అధికారి పనికిమాలిన చర్యగా అభివర్ణించాడు. బీసీసీఐతో పాటు క్రికెట్ లోకానికి సిగ్గుచేటని తెలిపాడు.

చేతన్ శర్మ స్ట్రింగ్ ఆపరేషన్ పై సోషల్ మీడియా వేదికగా ఓ ప్రచారం జరుగుతోంది. కావాలని అతనిని ఇరికించారని..దీని వెనుక బీసీసీఐ పెద్దలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐలో సెక్రటరీ జై షా అండతో మరోసారి చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన చేతన్ శర్మపై బోర్డులో పెద్దలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వారి పనే అని జోరుగా ప్రచారం జరుగుతుంది. జైషా ఆధిపత్యం తగ్గించేందుకే ఇలా చేశారని వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా విరాట్ కోహ్లీ పేరు డ్యామేజ్ చేయడానికి కూడా ఈ స్ట్రింగ్ ఆపరేషన్ ఉపయోగించుకున్నారన్నది ఆ వార్తల సారాంశం.