కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్ సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్ సీఎం

October 29, 2019

ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఓ గుడిలోని పూజారి చేతిలో నవ్వుతూ కొట్టించుకున్నారు. అయితే సీఎం ఇలా దెబ్బలు తినడానికి ఓ కారణం ఉంది. దీపావళి సందర్భంగా గోవర్ధన్ పూజలు నిర్వహించిన తర్వాత రాయ్‌పూర్‌లోని కోట జంజ్‌గిరికి దగ్గరలోని గౌర-గారి పూజకు హాజరయ్యారు. ఈ సమయంలో పూజారి కొరడాతో అతని చేతిపై కొట్టారు. జానపద సంప్రదాయం కొరడాతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుండటంతో ఆయన అలాగే చేశారు.  

ఆలయ పూజారి సైతం సీఎంను సామాన్య భక్తుడిగానే భావించి కొరడా ఝుళిపించారు. ఆరు కొరడా దెబ్బలు తిన్న తర్వాత సీఎం ఇక చాలు అన్నట్లు చేతిని వెనక్కి తీసుకున్నారు. ఈ సమయంలో సాంప్రదాయ దుస్తుల ధోతి, కుర్తా ధరించి కనిపించారు. తర్వాత పూజారిని ఆత్మీయంగా అలింగనం చేసుకుని గుడి నుంచి బయటకు వెళ్లారు. కాగా ఈ జానపద పండుగ ప్రతి సంవత్సరం దీపావళికి లక్ష్మి పూజల తరువాత జరుపుకుంటారు. ఈ పండుగను కార్తీ మాసం అమావాస్య రోజున ప్రత్యేక పూజలు చేసి తమ సంప్రదాయపద్దతిలో ప్రదర్శనలు నిర్వహిస్తారు.