సీఎం కాళ్లకు మొక్కిన మరో సీఎం.. ఎందుకంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం కాళ్లకు మొక్కిన మరో సీఎం.. ఎందుకంటే..

October 23, 2018

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి పాదాభివందనం చేశారు. వయసులో పెద్ద కావడం వల్ల గౌరవ భావంతో చేశాడా? కాదు..! తాను సీఎం కావడానికి సాయం చేసిందుకు పాదాభివందమా? కాదు…! కేవలం ఆశీర్వాదం కోసం.. తాను ఎన్నికల్లో గెలిచేలా చూడాలని కోరడానికి..!

ఛత్తీస్‌గఢ్ బీజేపీ నేత, ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. ఈ రోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదినాత్య నాథ్‌కు పాదాభివందనం చేశాడు. బీజేపీకే చెందిన యోగి సాధువు కావడంతో అతని దీవెన కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ వేసే ముందు ఈ కార్యక్రమం జరిగింది. సీఎం ఒక సీఎం పాదాభివందనం చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.

యోగి వయసులోనే కాకుండా రాజకీయాల్లో రమణ్ సింగ్  కంటే తక్కువ అనుభవమున్నవారు కావడం గమనార్హం. యోగి వయసు 46 కాగా, రమణ్ వయసు 66 ఏళ్లు. రమణ్  రాజ్ నందగావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2008, 2013లో ఆయన అక్కడి నుంచే గెలిచారు. రమణ్ సింగ్‌పై వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా పోటీ చేస్తోంది.