Chhattisgarh Cop Finds Rs 45 Lakh On Road, Hands It Over At Police Station 
mictv telugu

కానిస్టేబుల్ నిజాయితీ.. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలు అప్పగింత

July 24, 2022

రోడ్డుపై వెళ్తున్న క్రమంలో రూపాయి దొరికినా కళ్లకు అద్దుకుని జేబులో వేసుకుంటారు. అదే కట్టల కొద్ది డబ్బు దొరికితే ఇంకేమన్నా ఉందా.. గుట్టు చప్పుడు కాకుండా వాటిని స్వాధీనం చేసుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తికి, ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.45లక్షలు. అంత మొత్తంలో డబ్బు దొరికితే తిరిగిచ్చేసే వాళ్లను ఎప్పుడైనా చూశారా? ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మాత్రం నిజాయితీగా అలా ఇచ్చేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగింది. రాయ్‌పుర్‌కు చెందిన నీలాంబర్ సిన్హా.. కాయబంధా పోస్ట్‌ దగ్గర ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. శనివారం ఉదయం ఎప్పటిలాగే డ్యూటీలో ఉండగా.. రోడ్డు పక్కన ఓ బ్యాగ్‌ దొరికింది. అందులో అన్నీ రూ.500. రూ.2వేల నోట్లే. మొత్తం రూ.45లక్షలు. వెంటనే ఏమీ ఆలోచించకుండా స్థానిక పోలీసులకు అప్పజెప్పేశాడు. అతని నిజాయితీకి మెచ్చి పోలీసు అధికారులు రివార్డు కూడా ఇచ్చారు. ఈ నగదు ఎవరిదో తెలుసుకోవడానికి పోలీసులు విచారణ ప్రారంభించారు.