పండుగ పూట సీఎంకు కొరడా దెబ్బలు..! - MicTv.in - Telugu News
mictv telugu

పండుగ పూట సీఎంకు కొరడా దెబ్బలు..!

October 25, 2022

మీరు విన్నది,చదువుతున్నది నిజమే.ఒకటి, రెండు కొరడా దెబ్బలు కాదు ఐదుకుపైగానే. బాబోయ్ ఇక చాలు అనేదాకా కొట్టారు. మన తెలుగురాష్ట్రాల సీఎం కాదులెండి..ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భాగేల్. ఎందుకోసం ఇలా చేశారు..?సీఎం భూపేష్ కొరడా దెబ్బలు కథ ఏంటో తెలుసుకోవాలంటున్నారా…ఐతే ఇది చదివితీరాల్సిందే.

దీపావళి మరుసటి రోజు

దేశవ్యాప్తంగా దీపావళి ఘనంగా జరిగింది.పండుగ తర్వాత రోజు కొన్ని ప్రాంతాలు సంబరాలు హోరెత్తాయి. ఆ ప్రాంతాల ఆచారాల్ని బట్టి పండుగ చేసుకున్నారు. దీపావళి మరుసటిరోజు ఛత్తీస్ ఘడ్‌లో కొరడా దెబ్బలు తినే ఆచారం ఉంది. ఇందులో భాగంలో సీఎం భూపేష్ భాగేల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆచారం వెనుక…

దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామంలో గోవర్ధన పూజలో సీఎం భూపేష్ భాగేల్ పాల్గొన్నారు. గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ పూజల్లో భాగంగా వింత ఆచారాన్ని పాటిస్తారు. పండుగరోజున గోవర్ధన పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటే అన్ని విఘ్నాలు తొలగిపోయి శుభం కలుగుతుందని నమ్మకం.పూజ తర్వాత మాంసాహారాన్ని తింటారు. వారి నమ్మకం ప్రకారం సీఎం భూపేష్ భాగేల్ ప్రతీఏడాది పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటారు. ఈ సారి సీఎం భూపేష్ ని చేతిపై వీరేందర్ ఠాకూర్ అనే వ్యక్తి ఐదు కొరడా దెబ్బలు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో స్వయంగా సీఎం భూపేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు

 

సీఎంపై ప్రశంసలు

స్వయంగా ఆచారాలు పాటించిన సీఎంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం కొరడా దెబ్బలు తినడం గ్రేట్ అంటున్నారు.మరికొందరు సీఎం చేసిన పనిని వ్యతిరేకిస్తున్నారు. కొరడా దెబ్బలు తిని సమాజానికి ఏం మేసెజ్ఇస్తున్నారని కామెంట్స్ చేశారు.