మద్యం ఇక మీ ఇంటికే..సర్కారీ యాప్, వెబ్ సైట్
కేంద్రం మద్యం అమ్మకాలపై సడలింపులు ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా మందుకోసం ఎగబడుతున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మద్యాన్ని డోర్ డెలివరీ చేయలని నిర్ణయించింది.
దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీఎస్‌ఎమ్‌సీఎల్) ఆధ్యర్యంలో ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు జరుపనున్నారు. మద్యం కావాల్సిన వాళ్లు ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ తోపాటు వినియోగదారుడి పూర్తి వివరాలతో ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత ఫోన్‌కు వచ్చిన పాస్‌వార్డుతో యాప్‌లోకి లాగిన్ అయ్యి సమీపంలో వైన్ షాపులలో మందును కొనుగోలు చేసుకోవచ్చు. తరువాత మద్యం ఇంటికే డెలివరీ అవుతుంది. దీనికి ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది.