Chhattisgarh High Court allowed abortion of 14-year-old minor girl
mictv telugu

7 నెలల గర్భాన్ని తొలగించేందుకు 14 ఏళ్ల బాలిక పాట్లు.. హైకోర్టు తీర్పు ఇదీ

July 23, 2022

A tiger that was washed into the barrage in floods

14 ఏళ్ల మైనర్ బాలికను స్వంత బంధువు ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. తర్వాత మొఖం చాటేయడంతో ఆ బాలిక గర్భాన్ని తీయించుకోవడానికి అనేక పాట్లు పడింది.

తల్లిదండ్రులతో కలిసి అనేక ఆస్పత్రులు తిరిగింది. అయితే అవాంఛిత గర్భాన్ని తొలగించడానికి వైద్యులు నిరాకరించడంతో చివరికి హైకోర్టును ఆశ్రయించింది. చత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన జరుగగా, కోర్టుకు వెళ్లేసరికి బాలిక గర్భానికి 27 వారాలు గడిచింది. సింగిల్ బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకు రాగా, జస్టిస్ పి. సామ్. కోషి విచారించారు. అనంతరం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వ ఆస్పత్రిని ఆదేశించడంతో వారు వైద్య పరీక్షలు జరిపి అబార్షన్ చేసి గర్భాన్ని తొలగించవచ్చని నివేదిక సమర్పించారు. దీంతో బాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఆపరేషన్ చేయాలని కోర్టు సూచించింది. తాజా ఆదేశాలతో బాలికకు, ఆమె కుటుంబానికి పెద్ద ఊరట లభించింది.