సెలవు ఇవ్వలేదని.. ఐదుగురిని కాల్చేసి జవాన్ ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

సెలవు ఇవ్వలేదని.. ఐదుగురిని కాల్చేసి జవాన్ ఆత్మహత్య

December 4, 2019

Jawan  02

ఛత్తీస్‌గఢ్‌లో జవాన్ల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండో టిబెటన్ పోలీసు (ఐటీబీపీ)లో పనిచేసే రెహ్మాన్ ఖాన్ తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. బుధవారం ఉదయం 9 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. దీన్ని అడ్డుకోబోయిన మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని కదేనార్ క్యాంపులో చోటు చేసుకుంది. తర్వాత ఘాతుకానికి పాల్పడిన జవాను కూడా తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. 

తోటి జవాను ఇలా కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ స్పందించారు. సెలవులు మంజూరు చేయకపోవడంతోనే కోపంలో ఇలా చేసి ఉంటాడని అనుమానిస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.  రెహ్మాన్ ఖాన్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జవాన్ల బేస్ క్యాంపులో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.