టూరిస్టులను వెంబడించిన పులి..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

టూరిస్టులను వెంబడించిన పులి..వీడియో

February 17, 2020

tiger

పులులు అడవులను వదిలి జనాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అడవులకు అనుకుని ఉన్న ఊళ్ళల్లో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ పులి టూరిస్టులను వెంబండించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చత్తీస్‌ఘడ్‌లోని నందన్ వన్ అటవీలో సఫారీ కోసం కొందరు టూరిస్టులు వెళ్లారు. ఆ సమయంలో రెండు పులులు పోట్లాడుకుంటుండగా వాటి పక్కగా బస్సు వెళ్తోంది. ఒక్కసారిగా అందులోని ఒక పులి బస్సును వెంబడించింది. బస్సు కిటీకి ఉన్న కర్టన్‌ను గట్టిగా పట్టుకుంది. డ్రైవర్ బస్సును ఆపేశాడు. చాలాసేపు వరకు ఆ పులి కర్టన్ గట్టిగా పట్టుకుని విడిచిపెట్టలేదు. మరోవైపు బస్సులో ఉన్న టూరిస్టులు భయపడిపోయారు. అయితే చాలా సేపటి తర్వాత పులి ఆ కర్టన్‌ను విడిచిపెట్టడంతో టూరిస్టులు ఉపిరి పీల్చుకున్నారు. గత శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిందని, బస్సు డ్రైవర్ ఓంప్రకాష్ భారతి, టూర్ గైడ్ నవీన్ పురైనాను తొలగించినట్లు అధికారులు తెలిపారు. సఫారీ స్టాండర్డ్ ప్రొటోకాల్‌ను వాళ్లు మర్చిపోయారని నందన్ వన్ జంగిల్ సఫారీ డైరక్టర్ ఎమ్ మెర్సీ బెల్లా తెలిపారు. టూరిస్టు వాహనం ఇన్‌చార్జ్ ఫారెస్ట్ గార్డ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబందించిన వీడియోను ప్రముఖ బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు.