ఛత్తీస్ మంత్రి రాసలీల.. జర్నలిస్ట్ అరెస్ట్   - MicTv.in - Telugu News
mictv telugu

ఛత్తీస్ మంత్రి రాసలీల.. జర్నలిస్ట్ అరెస్ట్  

October 27, 2017

ఛత్తీస్‌గఢ్‌ మంత్రి రాజేశ్ మునత్‌కు  సంబంధించినట్లు భావిస్తున్న ఓ సెక్స్ వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. సీనియర్  జర్నలిస్ట్  వినోద్ వర్మ  అరెస్ట్  అయిన కొద్ది సేపట్లో  ఈ వ్యవహరం  బయటికి పొక్కింది. బీబీసీ మాజీ  జర్నలిస్ట్ , ఎడిటర్స్ గిల్డ్ అఫ్ ఇండియా  సభ్యడు అయిన  వినోద్ వర్మ  గత కొంత కాలంగా  తన దగ్గర  ఓ మంత్రి రాసలీలల  సీడీ  వుందని  చెబుతున్నారు.  దీతో బీజేపీ ఐటీ సెల్‌ నేత ప్రకాశ్‌ బజాజ్‌  “ మంత్రిని ఎవరో బెదిరిస్తున్నారు అని వినోద్‌పై ఫిర్యాదు చేశాడు.  ఛత్తీస్ గడ్  పోలీసులు  రంగ లోకి దిగి  ఢిల్లీలోని  వినోద్ వర్మ  ఇంటిపై దాడి చేసి ఐదు వందల సీడీలు , పెన్ డ్రైవ్ , లాప్ టాప్‌ను సీజ్ చేసి వర్మను అరెస్ట్ చేసారు .ఆయితే  పోలీసులు  కస్టడి తీసుకుంటున్న  సమయం లో సీడీలో వున్నది  ఛత్తీస్‌గఢ్  మంత్రి  రాజేశ్ మునత్ అని వినోద్  ఓ ప్రముఖ  మీడియా సంస్థ‌కు  తెలిపారు .ఇప్పుడు తదుపరి  విచారణ కోసం  రాయపూర్‌కి  తరలిస్తున్నారు.