అతని కష్టం ఫలించింది 27 ఏళ్ల కృషి అతనిని హీరోను చేసింది. ఏ గ్రామ ప్రజలు అయితే అతనిని హేళన చేసారో ఇప్పుడు ఆ గ్రామ ప్రజలే ఇప్పడు అతడే మా గ్రామ భాగ్యవిధాత అని చెబుతున్నారంటే అతని చేసిన గొప్పే పనే అందుకు నిదర్శనం.
అతని పేరు సాజా శ్యామ్ లాల్ (24) తన సొంత ఊరు చత్తీస్ గఢ్ రాష్ట్రం కోరియా జిల్లాలోని పహద్ . కోరియా జిల్లా రాష్ట్రంలో అత్యధిక నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రాంతం. దీంతో ఆ ప్రాంతంలో తాగునీటికి, మూగజీవాలకు నీటిని అందించలేని పరిస్థితి ఉండేది. ప్రభుత్వం నుంచి పట్టించుకునే నాథుడే లేడు. గ్రా ప్రజల దుస్థితి శ్యామ్ ను కదలించింది. దీంతో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి గ్రామ ప్రజల కోసం చెరువును తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే , శ్యామ్ కు అప్పుడు 15 ఏళ్లు . దీంతో శ్యామ్ కు ఎవరు మద్దతు ఇవ్వకపోవడమే కాక ఆ ఆలోచనను విరమించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.
అయినా తన ఆలోచనను విరమించుకోకుండా శ్యామ్ తనోక్కడే రోజు కొంతభాగం చెరువును తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగా గ్రామ పోలిమేర్లలో ఓ ప్రాంతాన్ని ఎన్నుకొని తవ్వకాన్ని ప్రారంభించాడు. రోజూ తన జీవనం కోసం పనికి వెళ్లొచ్చిన ఆనంతరం చెరువు కోసం 27 ఏళ్లుగా శ్రమదానం చేస్తూ వచ్చాడు. శ్యామ్ కష్టాన్నికి ఫలితం దక్కింది. చెరువుల్లోకి నీళ్లు వచ్చాయి. వాటిని ప్రజలు తమ అవసరానికి వినియోగించుకుంటున్నారు. శ్యామ్ మా భాగ్యవిధాత అని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు.