గిరిజన గ్రామాల్లో మతఘర్షణలు, విధ్వంసకాండ  - MicTv.in - Telugu News
mictv telugu

గిరిజన గ్రామాల్లో మతఘర్షణలు, విధ్వంసకాండ 

September 25, 2020

Chhattisgarh Tribals And Christians Conflict

ఛత్తీస్‌గడ్‌లోని గిరిజన గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. క్రైస్తవులకు, గిరిజనులు మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వానగా మారింది. ఓ మతపరమైన కార్యక్రమం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొండగావ్ జిల్లాలోని పలు గ్రామాల్లో అనేక ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసు బలగాలను మోహరించారు. దాడులకు గల  కారణాలపై ఆరా తీస్తున్నారు. 

కాకదాబేద, సింగన్‌పూర్, సిలాటి గ్రామాల్లో కొంత మంది చాలా కాలంగా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నారు. దీంట్లో భాగంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని డిమాండ్ చేశారు.  ఇది వివాదంగా మారడంతో ఇండ్లను ధ్వంసం చేసుకునే స్థాయికి వెళ్లిపోయింది. కొంత మంది స్థానికులు ప్రాణ భయంతో పారిపోయారని క్రిస్టియన్‌ ఫోరం అధ్యక్షుడు అరుణ్ పన్నాలాల్ వెల్లడించారు. ఇళ్లు ధ్వంసమైన వారికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు మాత్రం భూముల వివాదాల వల్లే రెండు వర్గాల మధ్య ఘర్షణలు చేసుకున్నాయని అంటున్నారు.