chia seeds recipes for weight loss
mictv telugu

గుప్పెడు గింజలతో బోలెడు ఆరోగ్యం

January 12, 2023

 chia seeds recipes for weight loss

చియా సీడ్స్ సూపర్ ఫుడ్. అత్యంత పోషకం ఇచ్చే పదార్థాలలో ఇవి ఒకటి. జెల్ లాంటి ఈ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. గుండె నుండి మెదడు వరకు శక్తిని పెంచడం వరకూ చియా సీడ్స్ ఎన్నో బెనిఫిట్స్‌ని కలిగి ఉన్నాయి. ఈ సూపర్‌ఫుడ్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని మిగతా ఆహారాలతో కలిపి తినొచ్చు.

చియా సీడ్స్ ఫైబర్ రిచ్‌గా ఉంటాయి. అందువల్ల ఆకలిని అరికట్టి, బరువు తగ్గేందుకు సాయపడతాయి. అంతేకాకుండా చియా సీడ్స్ తీసుకోవడం వల్ల విసెరల్ ఫ్యాట్ తగ్గుతుంది. దీనినే బెల్లీ ఫ్యాట్ అంటారు. చియా సీడ్స్ తో మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే దీనిని ఏ ఫుడ్‌లోనైనా కలిపి తీసుకోవచ్చు. దీంతోనే కొన్ని రెసిపీలు కూడా చేసుకోవచ్చును. అందులో కొన్ని మీ కోసం.

చియా పుడ్డింగ్:

ఓ గిన్నెలో పాలు, పెరుగు, చియా గింజలు, మాపెల్ సిరప్, ఉప్పు వేసి అన్నింటిని కలిపి 30 నిమిషాలు నానబెట్టాలి. రాత్రంతా మూతపెట్టి ఫ్రిజ్‌లో పెట్టి.. మరుసటి రోజు చిక్కగా, క్రీమీగా తయారైన పుడ్డింగ్‌లో తాజా ఫ్రూట్స్ వేసి తినేయడే. ఉదయాన్నే ఇది తినడం వలన ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది.

సలాడ్:

ఓ గిన్నెలో కొబ్బరిపాలు, చియా సీడ్స్, తేనె వేసి బాగా కలపాలి. 2 గంటల తర్వాత అందులో పళ్ళ ముక్కలు వేయాలి. గింజలను కూడా డ్రెస్సింగ్‌లా వేసి కొద్దిగా టాస్ చేయాలి. తర్వాత ఇంకేంటి తినడమే.

ఓట్స్ చియా:

ఓ గిన్నెలో ఓట్స్, చియా సీడ్స్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు వేసి కలపాలి. బాదం పాలు వేసి చిన్న మంటమీద ఉడకనివ్వండి. ఓట్స్ మెత్తగా ఉడికాక తేనె, పండ్ల ముక్కలు, నట్స్ వేయాలి. అంతే రెడీ.

డీటాక్స్ డ్రింక్:

ఓ గిన్నెలో చియా సీడ్స్, నీరు వేయండి. పుదీనా ఆకులు, నిమ్మరసం, తేనె కలపండి. ఇది 20 నుంచి 30 నిమిషాల తర్వాత పదార్థాలన్నీ మరోసారి కలపండి. అది కొద్దీగా జెల్లీలా తయారవుతుంది. దీనిని తాగడమే.

ఇవే కాకుండా మనం రోజూ తినే ఆహారంలోనే చియా సీడ్స్ ను మిక్స్ చేసుకుని తినేయొచ్చు. చాలా మంది ఉత్తి నీళ్ళల్లోనే వాటిని కలిపేసుకుని తాగేస్తుంటారు. ఎలా తిన్నా పర్వాలేదు, చియా సీడ్స్ మన డైట్ లో ఒక భాగం అయితే చాలు. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఫిట్ సెస్ కి ఫిట్ నెస్.