బీజేపీ ఎమ్మెల్యే బట్టలు చింపి తరిమికొట్టిన ప్రజలు.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ ఎమ్మెల్యే బట్టలు చింపి తరిమికొట్టిన ప్రజలు.. వీడియో

November 21, 2022

ఎమ్మెల్యేపై ఆగ్రహంతో తిరగబడిన జనం.. చొక్కా చింపేసి తరిమి తరిమి కొట్టార. కర్ణాటకలోని చిక్ మగళూరులో ఆదివారం జరిగిన ఈ ఘటన వీడియోలు ఆ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఆదివారం తెల్లవారుజామున పశువులకు మేత వేయడానికి దంపతులైన సతీష్ గౌడ, శోభ దంపతులు పొలానికి వెళ్లారు. అక్కడ వీరిపై ఏనుగు దాడి చేసింది. భయంతో పరుగులు తీయగా, శోభను వెంబడించిన ఏనుగు ఆమెను కాళ్ళతో తొక్కి చంపేసింది. కళ్లముందే భార్య చనిపోవడంతో భర్త తీవ్రంగా రోదించాడు. గతంలో కూడా ఇలా జరగడంతో భయాందోళనకు లోనైన స్థానికులు గ్రామంలో ఆందోళన చేపట్టారు.

 

అయితే బాధితురాలిని పరామర్శించడానికి సాయంత్రం వచ్చిన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి రాగా, ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే తీరిగ్గా సాయంత్రం వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా అంతే ధీటుగా సమాధానమివ్వడంతో రెచ్చిపోయిన ప్రజలు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊరి నుంచి తరిమి కొట్టారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే చొక్కా కూడా చిరిగిపోయింది. అతి కష్టమ్మీద ఎమ్మెల్యేను కాపాడిన పోలీసులు అక్కడ నుంచి తరలించారు.