Chicken betting in HYD.. TDP leader chinthamaneni prabhakar on the run
mictv telugu

HYDలో కోడి పందాలు.. పారిపోయిన టీడీపీ నేత చింతమనేని

July 7, 2022

కోస్తాంధ్ర జిల్లాల్లో సంక్రాంతి సీజన్‌లో మాత్రమే కనిపించే కోడిపందాలు హైదరాబాదు వరకు పాకాయి. నగర శివారులోని పటాన్‌చెరులో కోడి పందాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులకు దిగారు. బుధవారం రాత్రి ఈ దాడులు జరుగగా, అక్కడే ఉన్న టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసులను చూసి పారిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన అక్కడే మకాం వేసి పందాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు చేసి 100 కోళ్లు, రూ. 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అటు పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన చింతమనేని కోసం గాలింపు చేపట్టినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే చింతమనేనిపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. వివాదాస్పద వ్యక్తిగా పేరు గాంచిన ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉండడం గమనార్హం.