యూపీ : హిందూ దేవతలున్న పేపర్లలో చికెన్ ప్యాకింగ్.. ముస్లిం వ్యాపారి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

యూపీ : హిందూ దేవతలున్న పేపర్లలో చికెన్ ప్యాకింగ్.. ముస్లిం వ్యాపారి అరెస్ట్

July 5, 2022

దేశంలో ఇటీవల జరిగిన ఘటనలను చూస్తే పరమత ద్వేసం పెరిగిపోతున్నట్టు అనిపిస్తోంది. నుపుర్ శర్మ వ్యవహారం, రాజస్థాన్, మహారాష్ట్రలో హిందువుల తలలు నరికి వీడియోలు తీయడం, కాళీమాత నోట్లో సిగరెట్ వంటి ఘటనలు ఈ మధ్య కాలంలోనే జరిగాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా మరో ఘటన యూపీలో జరిగింది. సంభాల్ అనే ప్రాంతంలో తాలీబ్ హుస్సేన్ అనే వ్యాపారి చికెన్ షాపు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో చికెన్ ప్యాకింగుకు హిందూ దేవతలున్న పేపర్లను వాడాడు. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి తాలీబ్ దుకాణాన్ని తనిఖీ చేయబోయారు. దీంతో రెచ్చిపోయిన తాలీబ్.. పోలీసులపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. కాసేపటికి పోలీసులు అతడిని ఎట్టకేలకు అదుపులో తీసుకొని స్టేషనుకు తరలించారు. మతాల మధ్య ఘర్షణకు ప్రయత్నించడం, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.