కొండెక్కిన కోడి..సండే నో చికెన్..! - MicTv.in - Telugu News
mictv telugu

కొండెక్కిన కోడి..సండే నో చికెన్..!

May 27, 2017

ఎండకాలం వచ్చిందంటే చికెన్ రేట్లు తగ్గుతాయి. కిలో వందలోపే ఉండేది. కానీ ఈసారి కోడి రివర్స్ గేర్ లో వెళ్తోంది. రెట్టింపు ధరల్ని దాటేసింది. కిలో చికెన్ 240 రూపాయల పలుకుతోంది.
వీకెండ్ వచ్చిదంటే ముక్కలేనిదే ముద్ద దిగదు.నాన్ వెజ్ కంపల్సరీ ఉండాల్సిందే. అందులోనూ చికెన్ కే ప్రయారిటీ..కానీ ఒక్కసారిగా పెరిగిన రేట్లు …చికెన్ సెంటర్ల వైపు చూడాలంంటేనే భయపెడుతున్నాయి. కిలో 150 రూపాయలు ఉన్న చికెన్ అమాంతం 2 వందల నలభై దాకా చేరింది. ఇంచుమించు మటన్ తో పోటీపడుతోంది. కేజీ చికెన్ కొనేవాళ్లు అధిక ధరల వల్ల ఆఫ్ కేజీతోనే సరిపెట్టుకుంటున్నారు. కొందరైతే అటు వైపు వెళ్లడం మానేశారు. ఇంకొందరైతే ఇంత రేటు పెట్టి చికెన్ కొనేదాని కన్నా మటనే బెటారనుకుంటున్నారు.
మండుతున్న ఎండలకు కోళ్లు చనిపోతున్నాయని చికెన్ సెంటర్ నిర్వహకులు చెబుతున్నారు. కోళ్ల షార్టేజ్ వల్లే రేట్లు పెరిగాయని అంటున్నారు.