చిదంబరానికి సీబీఐ కస్టడీ - MicTv.in - Telugu News
mictv telugu

చిదంబరానికి సీబీఐ కస్టడీ

August 22, 2019

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కస్టడీ విధించేందుకు ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయనకు నాలుగు రోజుల కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశించింది. 

ఈ ఆదేశాల మేరకు చిదంబరం ఈ నెల 26 వరకూ సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. చిదంబరం కుటుంబసభ్యులు, ఆయన తరఫు న్యాయవాదులు రోజూ ఆయనను కలవవచ్చని కోర్టు పేర్కొంది. చిదంబరం విచారణలో సహకరించడం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. వారి వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి నాలుగు రోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. వచ్చే నాలుగు రోజుల్లో చిదంబరం కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆయనను రోజుకు అరగంట పాటు కలిసేందుకు న్యాయస్థానం అవకాశం కల్పించింది. కాగా, ఐఎన్ఎక్స్ కేసులో  సీబీఐ అధికారులు మాజీ ఆర్థిక మంత్రికి 20 ప్రశ్నలు సంధించారు. చాలా వాటికి ఆయన సమాధానం చెప్పలేదు. తనకు తెలీదని, పూర్తి వివరాలు తన వద్ద లేనవి చెప్పారు.