'ఆచార్య' ప్రీరిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా.. జగన్ మోహన్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆచార్య’ ప్రీరిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా.. జగన్ మోహన్ రెడ్డి

April 16, 2022

 

ccccc

టాలీవుడ్‌‌లో దర్శకుడు కొరటాల శివ కొత్త సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులు ఆ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకుంటారు. ఆ సినిమాలో డైలాగులు, ఫైట్స్, విజువల్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని ఎగబడతారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ కలయికలో ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు విడుదలైనా రోజు నుంచి నేటీదాకా అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈమెంట్‌ను ఈ నెల 23వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నారు.

Acharya

ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జగన్ కూడా వస్తుండడంతో ఈవెంట్ ఓ రేంజ్‌లో జరుగుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఓ వైపు జగన్, మరోవైపు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతారోనని ఆసక్తిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలైయ్యాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. ప్రతి నాయకుడి పాత్రను సోనుసూద్ పోషించాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.