అవసరమైతే నేనే కశ్మీర్‌లో పర్యటిస్తా : జస్టిస్ గొగోయ్
జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి 40 రోజులు గడిచిపోయయి. అప్పటి నుంచి ఆ ప్రాంతం అంతా కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలో ఉంది. పరిస్థితులు చేదాటిపోకుండా ఉండేందుకు కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఉన్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించడానికి విపక్షాలు ప్రయత్నాలు చేసినప్పటికీ కేంద్రం అనుమతించలేదు. దీంతో అక్కడి పరిస్థితుల పునరుద్దరణపై పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్.ఏబొబ్డే,ఎస్‌ఏ నజీర్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్‌లో పునరుద్ధరణకు ఉత్తర్వులు జారీ చేయడానికి ధర్మాసనం నిరాకరించింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలను కల్పించాలని సూచించారు. దీంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కశ్మీర్ వెళ్లేందుకు అనుమతిచ్చింది. ఈ సందర్భంగా కశ్మీర్‌లో పరిస్థితులపై పిటిషినర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కులు హరించి పోతున్నాయని, కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా బయటకు వెళ్లే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. వారి వాదన విన్న జస్టిస్ గొగోయ్ అవసరమైతే తానే స్వయంగా అవసరమైతే జమ్మూ కాశ్మీర్‌కు వెళ్తానని చెప్పారు. బాలల హక్కుల కార్యకర్త చేసిన ఆరోపణలు నిజమేనో.. కాదో తనిఖీ చేసి తెలుసుకుంటానని వెల్లడించారు.