మాజీ ఎమ్మెల్యేల పెన్షన్‌లో కోత పెట్టిన ముఖ్యమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ ఎమ్మెల్యేల పెన్షన్‌లో కోత పెట్టిన ముఖ్యమంత్రి

March 25, 2022

photo

పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్ కొత్త కొత్త నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి తాజాగా మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ విషయంలో దేశంలో ఎవ్వరూ చేయని సాహసం చేశారు. ఇకపై మాజీ ఎమ్మెల్యేలకు ఒక టర్మ్ వరకు మాత్రమే పెన్షన్ ఇస్తామని, ఆ తర్వాత రద్దు చేస్తామని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న ఇతర అలవెన్సులను కూడా రద్దు చేస్తామని వెల్లడించారు. ప్రజలకు సేవ చేసేందుకు ఓట్లు అడిగే ఎమ్మెల్యేలు, మూడు, నాలుగు సార్లు గెలిచిన తర్వాత వారి ఆస్తులు చూస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుందన్నారు. అయినా, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మాత్రం వదులుకోరనీ విమర్శించారు. దీని వల్ల ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం పడుతందని పేర్కొన్నారు. ఇలా మిగిలిన డబ్బుతో ప్రజలకు మెరుగైన సేవ చేస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య గురించి ప్రస్తావించారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కోసం చాలా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు రూపొందిస్తామని భరోసా ఇచ్చారు.