దుబ్బాక ఎన్నికలపై కేసీఆర్ స్పందన ఇదీ..  - MicTv.in - Telugu News
mictv telugu

దుబ్బాక ఎన్నికలపై కేసీఆర్ స్పందన ఇదీ.. 

October 29, 2020

దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో వేడి పెరిగింది. టీఆర్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య హోరాహోరీ విమర్శలు సాగుతున్నాయి. అయితే ఎన్నికలపై ఇంతవరకూ పెద్దగా స్పందించని సీఎం కేసీఆర్ అంతరంగం ఏంటో బయపడలేదు. మంత్రి హరీశ్ రావు ప్రచారభారాన్ని తలకెత్తుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏకంగా ఎన్నికల ఫలితంపైనే స్పందించారు. 

‘దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడ్‌ అయింది. ఆ ఎన్నికలు మాకు పెద్ద లేక్కకాదు. చిల్లర తతంగాలు నడుస్తుంటాయి. వాటిని మేం పట్టించుకోం. దుబ్బాకలో మేం మంచి మెజారిటీతో గెలుస్తాం.. ’ అని అన్నారు. ఆయన ఈ రోజు మేడ్చల్‌లో మీడియాతో ముచ్చటించారు. దుబ్బాలో గ్రౌండ్‌ చాలా స్పష్టంగా ఉందని అన్నారు. మరోపక్క దుబ్బాకలో గెలిచేది తామేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.  ఆయన ఈ రోజు మిరుదొడ్డి మండలం  మోతే గ్రామంలో ప్రచారం నిర్వహించారు. దేశంలో రామరాజ్యం నడుస్తుంటే, రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.