ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేసిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధుల సహాయంతో నడిచే మదర్సాలలో ఇక నుంచి జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతోరోజ క్లాసులు ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా జాతీయ గీతం పాడాలని ఆదేశించారు. యోగీ నిర్ణయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి స్వాగతించారు. దీని వల్ల విద్యార్ధులలో జాతీయతా భావాన్ని పెంచినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.