యోగి సంచలనం.. యూపీలోనూ 'అస్సాం ఎన్‌ఆర్సీ'! - MicTv.in - Telugu News
mictv telugu

యోగి సంచలనం.. యూపీలోనూ ‘అస్సాం ఎన్‌ఆర్సీ’!

September 16, 2019

Yogi Adityanath ..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే అస్సాం రాష్ట్రంలో మాదిరి ఉత్తరప్రదేశ్‌లోనూ జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) అమలు చేస్తామని తెలిపారు. సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన..కోర్టు ఆదేశాలతో కేంద్రం అస్సాంలో ఎన్ఆర్సీ అమలు చేయడాన్ని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. 

ఈ విషయంలో ప్రధాని మోదీని అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఆర్సీ  దశలవారిగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. రక్షణ దృష్ట్యా ఒకవేళ యూపీలో కూడా ఎన్ఆర్సీ అవసరమైతే కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఈ అంశమై ప్రధాని మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో చర్చిస్తానని చెప్పారు. అక్రమ వలసలకు అడ్డకట్ట వేయడానికి, దేశభద్రతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. గతంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కూడా ఆ రాష్ట్రంలో జాతీయ పౌర రిజిస్టర్ అమలు చేస్తమన్నారు.