Chief Ministers Of Telugu States Condole Death Of Krishnam Raju
mictv telugu

కృష్ణంరాజు మరణం వెండితెరకు తీరని లోటు.. ముఖ్యమంత్రుల నివాళి

September 11, 2022

ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, మాజీ కేంద్రమంత్రి.. కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు.

లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా కృష్ణం రాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. కృష్ణంరాజు గారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా’’ అని సీఎం ట్వీట్‌ చేశారు.