chikoti praveen kumar met rajasingh
mictv telugu

రాజాసింగ్‌తో చికోటి భేటీ..వారికి వార్నింగ్

November 11, 2022

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ కలిశారు. రాజాసింగ్‌ నివాసానికి వెళ్లి ఆయన క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చికోటి పలు ఘాటు వ్యాఖ్యలు చేసారు.

ఓ హిందుత్వవాదిగా రాజాసింగ్‌ను కలిసినట్టు చెప్పిన ఆయన.. బలవంతంగా మతమార్పిడులు చేసేవారి తోలు తీస్తానంటూ హెచ్చరించారు. హిందూత్వంపై రాజాసింగ్ చేసే పోరాటానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. తనపై జరిగే ఈడీ కేసులకు భయపడనని వెల్లడించారు. కేటీఆర్ మీద పోటీ చేస్తా అనేది కేవలం పుకార్లు మాత్రమేనని.. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరే ఆలోచన లేదన్నారు. “ఆర్జీవి నా కథను సినిమాగా తీసే ఆలోచనలో ఉండడంతో ఇటీవల ఆయన నన్ను కలిశారు. నాకు సినిమాల్లో ఆఫర్ ఇస్తే నటిస్తాను కానీ సినిమాకు నిర్మాతగా మాత్రం వ్యవహరించను” అని చికోటి స్పష్టం చేసారు.

గుంటూరు క్యాసినో నిర్వహించారనే ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన చికోటిపై ఇటీవల ఈడీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే..