తన హత్యకు కుట్ర జరుగుతోందని..పోలీస్ శాఖ నుంచి రక్షణ కావాలని కోరారు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్. తన కారు చోరీ జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తన హత్య కు కుటలో భాగంగానే ముసుగు వేసుకొని వచ్చిన వ్యక్తులు తన కారు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. రాజకీయాల్లోకి వస్తున్నా అని తెలిసి కొంతమంది వ్యక్తుల తనను హత్య చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. క్యాసినో కేసులో పలువురు రాజకీయ నాయకులు పేర్లు చెప్పాలంటూ బెదరించారని..తాను ఒప్పుకోకపోవడంతో చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తనకు తెలిసిన వ్యక్తులే మర్డర్‌కు కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. ప్రాణహానీ ఉన్నందున హైదరాబాద్ పోలీసులు తనకు సెక్యూరిటీ కల్పించాలని చికోటి ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున చికోటీ ప్రవీణ్ కారు అపహరణకు గురైంది. చికోటీకి చెందిన ఇన్నోవా కారును దుండగులు ఎత్తుకెళ్లారు. సిసి కెమెరాల కారు చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. దీనిపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. గత వారం రోజులుగా తన ఇంటిపై రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.