శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం భారత్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీం ఇండియా ఆటగాళ్లను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ప్రాక్టీస్ అనంతరం వారిని కలిసేందుకు రోహిత్ శర్మ వెళ్ళాడు. ఈ సందర్భంలో ఓ చిన్నారి రోహిత్‌ను చూసి ఎమోషనల్ అయ్యాడు. తన అభిమాన ఆటగాడిని చూడగానే అతడి కంట్లో నీళ్ళు తిరిగాయి. ఏడుస్తున్నా ఆ చిన్నారిని రోహిత్ బుజ్జగించాడు. బుగ్గలు గిల్లుతూ ఓదార్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Cricketer Rohit Sharma interacting with an young cricket fan from Assam in Guwahati.
Adorable Moments!@ImRo45 pic.twitter.com/Nyzc4D9fHg
— Pramod Boro (@PramodBoroBTR) January 9, 2023
నేటి(jan 10) నుంచి భారత్ – శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. టీ 20 సిరీస్‌కు దూరమైన రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో షమీ జట్టులో చేరారు.ఈ సిరీస్‌లో ఇరు జట్లు మొత్తం మూడు వన్డేల్లో తలపడనున్నాయి. 2023 చివరిలో వన్డే ప్రపంచ్ కప్ ఉండడంతో ప్రస్తుతం 50 ఓవర్ల మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. చివరిగా బంగ్లాదేశ్‌తో టీంఇండియా వన్డే సిరీస్ కోల్పోవడంతో ఈ సిరీస్‌లో రాణించాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలచోన తనకి లేదని రోహిత్ స్పష్టం చేశాడు. 2024 ప్రపంచ్ కప్ ప్రణాళికలలో భాగంగా టీ20 జట్టులో కుర్రాళ్లకు పెద్దపీట వేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లు పొట్టి ఫార్మెట్ లో మరి కనిపించరని వార్తలు వస్తున్నాయి. కానీ రోహిత్ మాత్రం టీ20లను వదిలేది లేదని చెప్పడం విశేషం.