పోరడు దొడ్లోకి దూరాడు.. అతడు షాక్.. నవ్వుల్ నవ్వుల్! - MicTv.in - Telugu News
mictv telugu

పోరడు దొడ్లోకి దూరాడు.. అతడు షాక్.. నవ్వుల్ నవ్వుల్!

March 28, 2018

పిల్లలే అంత. పొంతలో పెడితే పొయ్యిలోకి వస్తారు. కనిపించిన ప్రతీదాన్నీ, ప్రతి ఒక్కర్నీ కెలక్కపోతే వారికి నిద్రపట్టదు. లెవీ అనే ఈ అమెరికన్ తీటపోరడు ఏం చేశాడో తెలిస్తే ముక్కున వేలేసుకుని, తర్వాత పడీపడీ నవ్వేస్తారు. లెవీ ఇటీవల తల్లిదండ్రులతో కలసి ఓ హోటల్ వెళ్లాడు. మెక్కాడు. తర్వాత చేతులు కడుక్కోడానికి టాయిటెట్ల వైపు వెళ్లాడు. తల్లిదండ్రులు ఆ విషయం పట్టించుకోలేదు.

లెవీ టాయిటెట్ల వైపు వెళ్లాడు. ట్యాప్ అందలేదో ఏమో అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. తలుపు కిందిభాగంలో కాస్త ఖాళీ ఉన్న ఆ టాయిలెట్లలో ఎవరైనా ఉన్నారేమో అని వంగి వంగి చూశాడు. ఒక టాయిలెట్లో ఎవరో ఉండడం కనిపించింది. అంతే గబుక్కున వంగి లోపలికి దూరాడు. పిల్లాడు దూరడాన్ని చూసి లోపల ఉన్న మనిషి షాక్ తిన్నాడు. తర్వాత నవ్వుకుని వీడియో తీశాడు.

లోపలికి చొరబడిన లెవీ.. ఆ కక్కసుపై కూర్చున్న వ్యక్తిని ‘నే పేరేంటి?’ అని ప్రశ్నించాడు. అతడు ఆండ్రూ అని బదులిచ్చాడు. ఈ బుడ్డోడు మళ్లీ.. ‘నేను చేతులు కడుక్కోడానికి, నన్ను పట్టుకుని సాయం చేస్తావా? అని అడిగాడు. ఆండ్రూ నవ్వేసి, ‘నీ అమ్మ బయట ఉంది కదా’ అని అన్నాడు. దీంతో లెవీకి తానేదో తప్పు చేసినట్లు అర్థమైంది. తలుపు తీసుకుని బయటకెళ్లబోయాడు. తలుపు వేసి పోతావు కదా అని ఆండ్రూ అడగ్గా, ‘నువ్వే వేసుకోవాలి కదా’ అని తుర్రున్నాడు పోరడు..

తర్వాత ఆండ్రూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరలై లెవీ తండ్రికి తెలిసింది. ‘నా బిడ్డడే. చాలా ఫ్రెండ్లీ. కాకపోతే అతి.. సారీ’ అని మెసేజ్ పెట్టగా, ఆండ్రూ ‘పిల్లలు అంతేగా’ ని బదులిచ్చాడు. ఈ వీడియోను ట్విటర్లో 160000 సార్లు రీట్వీట్ చేసుకోగా, 6 లక్షలకుపైగా లైకులొచ్చాయి.