చిన్నారి లేఖకు సచిన్ ఫిదా... - MicTv.in - Telugu News
mictv telugu

చిన్నారి లేఖకు సచిన్ ఫిదా…

September 8, 2017

లెజెండ్ క్రికెటర్ సచిన్ ను క్రికెట్ కు దేవుడిగా ఆరాధిస్తారు. సచిన్ ను పెద్దలతోపాటు పిల్లలు కూడా అభిమానిస్తూ ప్రశంసిస్తుంటారు. కానీ ఓ ఆరేళ్ల చిన్నారి వినూత్న రీతిలో సచిన్ ను ప్రశంసిస్తూ ఉత్తరం రాసింది.

“డియర్ సచిన్ అంకుల్ .. నా పేరు తార. నేను సారా అక్కలాగే ఉంటా కాని నాకు ఆరేళ్లు .. నేను రీసెంట్ గా మీ మూవీ చూసాను నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఎంతో చిలిపి పిల్లగాడివి అని తెలిసి నవ్వుకున్నాను. నీ చివరి మ్యాచ్ చూసి నేను ఎంతో ఏడ్చాను . సచిన్ అంకుల్ ..నేను నిన్ను, సారా అక్క, అర్జున్ అన్న అంజలీ అంటీని కలవాలనుకుంటున్నా. నేను కలవొచ్చా “అంటూ ఎంతో క్యూట్ గా చిన్నారి తారా సచిన్ కు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంకు సచిన్ ఫిదా అయ్యాడు. ట్వీట్టర్ ద్వారా చిన్నారి తారాకు థ్యాంక్స్ తెలియజేశాడు. మూవీని చూసి ఎంజైయ్ చేసినందుకు సంతోషం అని తెలిపాడు . చిన్నారి తార నువ్వు ఎప్పటికి నవ్వుతూ ఉండాలని ట్వీట్టర్ ద్వారా తెలిపాడు.