మేడ్చల్‌లో దారుణం..12 ఏళ్ల బాలికను 23 ఏళ్ల వాడికిచ్చి..
బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా యథేచ్ఛగా సాగిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్‌కు కూతవేట దూరంలోనే దారుణం జరిగింది. మేడ్చల్ జిల్లాలో 12 ఏళ్ల బాలికను 23 ఏళ్ల వాడికిచ్చి కట్టబెట్టారు. కరోనా సమయంలో జరిగిన ఈ పెళ్లికి 50 మంది తగుదుమమ్మా అని మూతిగుడ్డలు కూడా కట్టుకోకుండా హాజరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలల హక్కుల సంఘం కార్యకర్త అచ్యుతరావ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లి సమీపంలోని కొండ్లకోయ మాతా ఆలయలంలో జూన్ 1న ఈ పనికిమాలిన పెళ్లి జరిగింది. 12వ తరగతి చదువుతున్న అమ్మాయి నెలకిందంటే పెద్దమనిషి అయిందని బాలల హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ఆమెకు 16 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పెళ్లి చేసుకున్న వరుడిపై, ఇద్దరి తల్లిదండ్రులపై, వారికి సహకరించిన వారిపై పక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. పెళ్లికొడుకు రాజు భవననిర్మాన కార్మికుడిగా పనిచేస్తున్నారు.