మోహన్‌లాల్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌కు 13 ఏళ్లే.. - MicTv.in - Telugu News
mictv telugu

మోహన్‌లాల్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌కు 13 ఏళ్లే..

September 25, 2019

13 సంవత్సరాల కుర్రాడు ఓ సినిమాకు మ్యూజిక్ దర్శకుడు కాబోతున్నాడు. ఇంత చిన్న వయసులో సినిమాకు సంగీత దర్శకునిగా వ్యవహరించడం సాహసమే అనాలి. మరోవైపు చిత్రంగా అనిపించవచ్చు. అతని పేరు నాదస్వరం. పేరుకు తగ్గట్టు సంగీతంపై అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకుని సంగీత పుత్రుడు అయ్యాడు. అతని టాలెంట్ చూస్తే ఎవరైనా ఔరా అనాల్సింది. అలా ఔరా అనుకున్న మలయాళం నటుడు మోహన్ లాల్ తన సినిమాతోనే ఈ బుడ్డోడికి మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తున్నాడు. 

Mohanlal

మోహన్ లాల్ మొదటిసారి మెగాఫోన్ పట్టుకుని సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే నాదస్వరాన్ని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘బరోజ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  3డి టెక్నాలజీతో రెడీ అవుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ఓవైపు మోహన్ లాల్ దర్శకత్వం చేయడం, మరోవైపు 13 సంవత్సరాల వయసున్న నాదస్వరం ఈ సినిమాకు సంగీతం అందించడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. చూడాలి మరి బుడతడి సంగీతం ఎలా వుంటుంది అనేది.