నేటికాలంలో ఆర్థిక సేవలనేవి ఒక వయస్సు వర్గానికి పరిమితం కాదు. మైనర్ కూడా తన బ్యాంకు అకౌంట్ ను సులభంగా తీసుకోవచ్చు. 2014 నుంచి ఈ సదుపాయాన్ని పదేళ్ల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు ఆర్బిఐ అందించింది. దీంతో పిల్లలకు బ్యాంకు అకౌంట్ తెరవడం చాలా సులభం అయ్యింది. పిల్లల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ యంట్ స్టార్స్ అకౌంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెహ్లా కదమ్, పెడ్లీ ఉడాన్, హెచ్డిఎఫ్సి కిడ్స్ అడ్వాంటేజ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూత్ బ్యాకింగ్ అకౌంట్ ఉన్నాయి. అయితై మైనర్ల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల వయస్సు
చాలా బ్యాంకులు మైనర్లకు రెండు రకాల అకౌంట్స్ ను కలిగి ఉన్నాయి. ఒకటి పదేళ్లలోపు పిల్లలకు, రెండోది 10 నుంచి 18ఏళ్లలోపు పిల్లలకు. పదేళ్లకంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే తల్లిదండ్రులు పిల్లలో కలిసి అకౌంట్ తీసుకోవల్సి ఉంటుంది.
బ్యాకింగ్ సౌకర్యాలు
బ్యాంకులు మైనర్లకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాయి. చాలా బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ పరిమితి రూ. 2500 నుంచి 5వేల వరకు ఉంటుంది. ఇవేకాకుండా చెబ్ బుక్ లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలతో సహా ఈ అకౌంట్లలో అన్ని రకాల బ్యాంకింగ్ సౌకర్యాలు అందించబడుతాయి.
డెబిట్ కార్డు
కొన్ని బ్యాంకులు ఛాయాచిత్రాలతో కూడిన డెబిట్ కార్డులను జారీ చేస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు కార్డుపై తల్లిదండ్రులు లేదా పిల్లల పేర్లు ఉంటాయి. ఎస్ఎంఎస్ అలర్ట్ సదుపాయం యాక్టివేట్ ఉండేలా చూసుకోవాలి. దీంతో లావాదేవీల గురించి సమాచారం మీకు తెలుస్తుంది. డబ్బును సురక్షితంగా ఎలా విత్ డ్రా చేసుకోవాలనేది మీ చిన్నారిని ఏటీఎంకు తీసుకెళ్లి ఒకసారి చూపించండి.
ఖర్చు పరిమితి
మైనర్ అకౌంట్ కు కూడా లిమిట్ ఉంటుంది. ఇది బ్యాంకుపై ఆధారపడి ఉన్నప్పటికీ..బ్యాంకు ఇచ్చిన పరిమితి ప్రకారం, 1000, 2500, 5000ల వరకు పొందవచ్చు. మీరు బ్యాంకు నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో తల్లిదండ్రలు అనుమతి లేకుండా 50 వేలు, తల్లిదండ్రుల అనుమతితో రూ. 2లక్షల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.