చిట్టి తల్లి క్షమించకు... - MicTv.in - Telugu News
mictv telugu

చిట్టి తల్లి క్షమించకు…

December 5, 2017

 

అమ్మకు ఆలికి తేడా తెలియని సమాజం ఇది రేష్మ.

కత్తిచూపులతో ఆడదాన్ని ప్రతీక్షణం గాయపరిచే గలీజ్ లోకం తల్లి ఇది.

ఈ మాటలు మీ అమ్మ నీకు ఇంకా చెప్పలేదనుకుంటా.

నిన్ను కంటిదీపం అని ముర్సిపోయిన మీ నాన్న, స్త్రీని మాంసపు ముద్దలా చూసే మూర్ఖులు ఉంటారని కూడా నీకు చెప్పలేదనుకుంట.

ఆడదాని రుచి మరిగిన కామ పిశాచాలకు ఏడేళ్ల నువ్వు కూడా “కోరిక”లా కనిపిస్తావని వాళ్లు ఊహించలేదు.

అందుకే నీతో ఆ విషయాలను మాట మాత్రమైనా చెప్పలేదు.

వాళ్లకు ఏ మాత్రం అనుమానం వచ్చినా ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఉండేదానివి.

చిట్టి తల్లి నీకో విషయం తెలుసా?

నీకు సురక్షితమైన సమాజం లేకపోవడానికి మాతో పాటు ప్రభుత్వం, టీవీ,సినిమాలే కారణం.

పసిపిల్లలతో పాడు డాన్సులు చేయించి, వాళ్లను కూడా సెక్స్ సింబల్ గా మార్చిన ఘనత మా టీవీలదే తల్లి.

ఆడదాన్నో అవసరంలా మార్చిన జబర్ దస్త్ ముచ్చట్లను నట్టింట్లోకి తెచ్చుకుని, మెదళ్లలోనే మానసిక స్ఖలనం చేసుకుని భావప్రాప్తి పొందుతున్న లత్కోర్ జాతి తల్లి మాది.

ఓటు హక్కు లేని మీ కోసం కూడా పనిచేసే నాయకులను మేం ఎన్నటికీ తయారుచేసుకోలేం తల్లి.

అందుకే మమ్మల్ని అస్సలు క్షమించకు.

వీలైతే స్వర్గం నుంచే మా మీద కాండ్రించి ఉమ్మేయ్.