లాక్‌డౌన్‌లో అల్లర్లకు కుట్ర...హైదరాబాద్‌లో ఇద్దరి అరెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌లో అల్లర్లకు కుట్ర…హైదరాబాద్‌లో ఇద్దరి అరెస్ట్ 

April 1, 2020

Childhood friends arrest in hyderabad

కరోనా మహమ్మారి కారణంగా యావత్ దేశం 21 రోజుల లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ జనసంద్రంతో ఉండే నగరాలు ప్రశాంతంగా మారాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ నగరంలో అల్లర్లు సృష్టించడానికి ఇద్దరు బాల్య స్నేహితులు చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. 

రియాసత్ నగర్ కు చెందిన హర్షద్, బాబానగర్ కు చెందిన అబ్దుల్ వసీలు ఇటీవల సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అల్లర్ల వీడియోలు చూసి హైదరాబాద్ లో కూడా ఆ తరహా అల్లర్లను సృష్టించాలని పథకం పన్నారు. అందులో భాగంగా కంచన్ బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో బస్సుకు నిప్పు పెట్టేందుకు యత్నించారు. అలాగే మాదన్నపేటలో ఓ వర్గానికి చెందిన ప్రార్ధనా మందిరాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలతో అప్రమత్తమైన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితులు హర్షద్‌, అబ్దుల్‌ వసీలను అరెస్టు చేశారు. మాదన్నపేట, కంచన్‌బాగ్‌ ఘటనల తోపాటు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక ఏటీఎంను కూడా ధ్వంసం చేసినట్టు నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. పోలీసులు వీళ్లపై కేసు నమోదు చేసి వీరిద్దరి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారిస్తున్నారు.