Home > Featured > మిడతలను మడతెడుతోన్న చిన్నారులు..వీడియో వైరల్

మిడతలను మడతెడుతోన్న చిన్నారులు..వీడియో వైరల్

childrens bang utensils and drums in an agricultural field as a precautionary measure to ward off locusts

పంటలను నాశనం చేసే రాకాసి మిడత దేశవ్యాప్తంగా రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆఫ్రికా నుంచి గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాయి. రాజస్థాన్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పంట చేలను లూటీ చేస్తున్నాయి. దీంతో రైతులు అప్రమత్తమయ్యారు. మిడతల నుంచి పంటలను కాపాడుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.

ఈ క్రమంలో కొందరు పంట పొలాల్లో క్రిమిసంహారకాలన స్ప్రే చేస్తూ ముడతలను అడ్డుకుంటున్నారు. మరికొందరు తమ చేలలో పడ్డ మిడతలను తరిమించేందుకు డబ్బాలు, డ్రమ్ములు వాయిస్తూ శబ్దాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కొందరు చిన్నారులు పెద్దవాళ్లతో కలిసి తలెలు, గిన్నెల శబ్దం చేస్తూ మిడతలను తరుముతున్నారు. తద్వారా తమ కూరగాయ తోటల్లో వాలిన మిడతలు పారిపోయేలా చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విపత్తు వేళ చిన్నారుల సంకల్పానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Updated : 29 May 2020 3:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top