చిలీలో కార్గో విమానం అదృశ్యం..38 మంది ఆచూకీ గల్లంతు - MicTv.in - Telugu News
mictv telugu

చిలీలో కార్గో విమానం అదృశ్యం..38 మంది ఆచూకీ గల్లంతు

December 10, 2019

Chilean 01

చిలీ దేశానికి చెందిన మిలటరీ విమానానికి ఘోర ప్రమాదం జరిగింది. 38 మందితో సోమవారం సాయంత్రం బయలుదేరిన విమానం  కూలిపోయింది.ఈ విషయాన్ని మంగళవారం ఆ దేశ వైమానిక దళం ప్రకటించింది. వైమానిక దళానికి చెందిన సి130 అదృశ్యమైనట్టు తెలిపారు. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కంట్రోల్‌ రూంతో సంబంధాలు తెగిపోయినట్టు చెప్పారు. విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించేందుకు మిలటరీ అధికారులు రంగంలోకి దిగారు. 

చిలీలోని పుంటా అరేనస్ నుంచి అంటార్కిటికా మంచుఖండంలో ఉన్న వైమానిక స్థావరానికి బయలుదేరింది. దీంట్లో 21 మంది ప్రయాణికులతోపాటు 17 మంది విమానయాన సిబ్బంది ఉన్నారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే రాడార్‌పై విమానం కనిపించకపోవడంతో ప్రమాదానికి గురైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మిలటరీకి చెందిన 130 సీ కార్గో సైజు విమానం అదృశ్యం కావడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఈ విమానాన్ని సైన్యాన్ని ఒకచోట నుంచి మరొక చోటుకు తరలించడం, ఆర్మీసామాగ్రిని చేరవేడయం, విపత్తుల్లో సహాయం కోసం వీటిని వినియోగిస్తూ ఉంటారు.