మిరపకాయలు తింటే మీ గుండె సేఫ్!  - MicTv.in - Telugu News
mictv telugu

మిరపకాయలు తింటే మీ గుండె సేఫ్! 

December 20, 2019

G02

స్థూలకాయం, సరైన ఆహార అలవాట్లు లేక  లక్షలాది మంది గుండె పోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏటా ఇలా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తీసుకునే ఆహారం, ఒత్తిడి కారణంగా వయసుతో పనిలేకుండా  గుండె పోటు వస్తోంది. దీన్ని ముందుగానే చెక్ పెట్టేందుకు ఎన్నో ఆహార పద్దతులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. తాాజగా ఇటలీ పరిశోధకులు మనం తీసుకొని ఆహారంలో మరో అంశాన్ని  కనిపెట్టారు. మిరపకాయలు ఎక్కువగా తీసుకుంటే గుండె పోటు రాకుండా 40 శాతం వరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు.   

మనం తీసుకునే భోజనంలో వారానికి నాలుగు సార్లు మిరపకాయలు తింటే గుండె పోటు తగ్గుతుందని గుర్తించారు. దీంట్లో ఉండే ‘క్యాప్‌సేసియన్‌’ పదార్థం గుండెకు రక్షణ కలిగిస్తుందని వెల్లడించారు. అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలోజీ జర్నల్‌లో దీన్ని ప్రచురించారు. దీని కోసం 23 వేల మందిపై పరిశోధనలు చేసినట్టు చెప్పారు. వారి ఆహార అలవాట్లను ఎనిమిదేళ్ల పాటు పరిశీలించారు. ఈ మధ్య కాలంలో చనిపోయిన 1,236 మందిని పరిశీలించగా వారిలో వారానికి నాలుగు సార్లు ఆహారంతో  మిరపకాయలు తీసుకోవడంతో వీరికి 40 శాతం వరకు గుండెపోటు ప్రభావం తగ్గిందని పేర్కొన్నారు. మొత్తానికి కారం తెప్పించే మిరపకాయలు గుండెపై మమకారాన్ని చూపిస్తాయన్నమాట.