హిందూమతమనేది బైబిల్లా పుస్తకం పట్టుకుని ప్రచారం చేసే మతం కాదని చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ అన్నారు. హిందూమత ధర్మాన్ని ప్రచాం చేయడానికి కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయని వివరించారు. మాలదాసరులు, ఒగ్గు కథకులు ఆ వివరాలు చెబుతారన్నారు. ‘‘నాకు చాలామంది క్రైస్తవ స్నేహితులు ఉన్నారు. ఇతర మతాల వాళ్లూ ఉన్నారు. అన్ని మతాలు మంచే చెబుతున్నారు. కానీ చాలామంది ఆచరించడం లేదు. పక్కింటాయన పటాకులు కాలిస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నావు. నీ కొడుకు పటాలు కాలిస్తే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తావా?’’ అని ఆయన ప్రశ్నించారు. మైక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మతసామరస్యం, హిందూ ధర్మం వంటి అనేక అంశాలపై మాట్లాడారు. సంస్కృతం బ్రాహ్మణ భాష కాదని, ఔరంగజేబు అన్న దారా షికో సంస్కృతంలో పుస్తకాలు రాశారని వివరించారు. నైజాం నవాబు చాలామంది వేదపండితులకు దానధర్మాలు చేశారని చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారలో ఈ వీడియోలో చూడండి..